మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. సుబ్బారాయుడిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ కావడం రాజకీయ పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం మీడియాతో ముద్రగడ మాట్లాడుతూ… తమ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడుని ముద్రగడ కలవడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాపులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని వారు చెపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement