మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఓ బహిరంగ లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలకు రైతుల తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందని లేఖలో పేర్కొన్న ఆయన.. జిల్లాకు ఒకటి చొప్పున ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తీసే డిస్టిలరీ ఏర్పాటు కావాలని.. తద్వారా ధాన్యం తడిచినా రైతులకు మద్దతు ధర వస్తుందన్నారు. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయని ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు ధాన్యం నుంచి స్పిరిట్ తయారు చేసే డిస్టిలరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే రైతులకు నష్టాలు రావన్న ఆయన వరి వద్దనీ వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. నీరు అధికంగా ఉండే భూముల్లో వరి తప్ప వాణిజ్య పంటలకు అస్కారముండదని ఆయన లేఖ ద్వారా సీఎంల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ముద్రగడ పలు అంశాలపై ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital