- ఆస్తుల జప్తుకు ఈడీ ఆదేశాలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గట్టి షాక్ తగిలింది. ముడాస్కామ్ కేసుకు సంబంధించి రూ.300 కోట్ల విలువైన 142 స్థిరాస్తులను జప్తు చేయాలని ఈడీ ఆదేశించింది. ముడాస్కామ్ లో సిద్ధరామయ్యకు సంబంధించిన వ్యక్తులతో ఈడీ ఈ ఆస్తులను లింక్ చేసింది.
సిద్ధరామయ్య భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటక లోకాయుక్త అధికారి పర్యవేక్షణలో విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతించడంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను మొదటి నిందితుడిగా చేర్చారు.
ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్‌స్వామితోపాటు మరో వ్యక్తి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. సిద్ధరామయ్య భార్య పార్వతి.. మైసూర్‌లోని ఇతర ప్రాంతాల్లో 3.16 ఎకరాల భూమిని వివిధ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన తర్వాత ఆమెకు ముడ కింద 14 ప్లాట్లు కేటాయించారు. ఇందులో రూ.45 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.