Saturday, November 23, 2024

ద్రావిడ్ టీమిండియా కోచ్ అవుతాడు..ఎమ్మెస్కే ప్రసాద్‌ ఛాలెంజ్

భారత జట్టు మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ద్రవిడ్‌ కోచ్‌గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవి భాయ్‌ యుగం ముగిసిన తర్వాత.. ఎంఎస్‌ ధోని మెంటార్‌గా, ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని నా సహచర కామెంటేటర్లతో ఛాలెంజ్‌ చేశా. ఐపీఎల్‌ కామెంట్రీ చేస్తున్న సమయంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. కోచ్‌గా ద్రవిడ్‌, మెంటార్‌గా ధోని ఉంటే భారత క్రికెట్‌కు అదొక వరంలా మారుతుంది. ఇద్దరూ కూల్‌గా ఉంటారు. అందులో ఒకరు(ద్రవిడ్‌) మరీ హార్డ్‌ వర్కర్. ఇండియా ఏ జట్టులో చాలా మంది ఇప్పటికే ఆయన శిక్షణలో రాటుదేలుతున్నారు. నేను అనుకున్నట్లుగా ధోని మెంటార్‌, ద్రవిడ్‌ కోచ్‌ కాకపోతే నేను నిరాశచెందుతాను’’ అని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేదు.

ఇది కూడా చదవండి: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement