టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ష్కాడ్ ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో వెటరన్ శిఖర్ ధావన్ కి మొండిచెయ్యి చూపడం మినహా అభిమానులను సప్రైజ్ కి గురిచేసి విధంగా ఎంపిక ఏమి లేదు. ఎంపిక జరిగినా విధానంపై కూడా ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అయితే అనూహ్యంగా క్రీడాభిమానులకు బీసీసీఐ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni )ని టీమ్‌కు మెంటార్‌గా నియమించి అతని అభిమానులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్ బ్లూ జెర్సీలో కనిపించకపోయినా.. కనీసం ఇలా మెన్ ఇన్ బ్లూ వెనుకుండి నడిపిస్తుండటం ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కొత్త రోల్‌ను ఎమ్మెస్ ఎలా పోషిస్తాడో అని ఫ్యాన్సే కాదు.. మొత్తం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.ః
ప్రస్థుతం టీమిండియాకు ప్రస్తుతం రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ రూపంలో టీమిండియాకు మంచి సహాయక సిబ్బంది ఉండగా.. ధోనీని ఎందుకు టీమిండియాతో చేర్చాడంపై అభిమానులు ఆలోచిస్తున్నారు. దీనికి కారణం బలంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఆ సారి ఎలాగైన టీమిండియా కప్పు కొట్టాలని బీసీసీఐ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మిస్టర్ కూల్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ధోని ఇప్పటివరకు టీమిండియాకు మూడు మేజర్ ఐసీసీ టోర్నీ టైటిల్స్ అందించాడు. ఆటకు దూరమైనా అతనిచ్చే సలహాలు ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఉపయోగంగా మారుతాయి. అందుకేనేమో.. ఎలాగైనా 2021 టీ 20 ప్రపంచకప్ కొట్టాలని భావించిన టీమిండియా ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేసింది.
పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించిన అనుభవం దృష్ట్యా ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యమైన ఐసీసీ టోర్నమెంట్‌లను గెలవడానికి ఎలా ప్లాన్ చేయాలో ధోనికి బాగా తెలుసు. ధోనీ కెప్టెన్సీలో తొలి టీ 20 ప్రపంచకప్‌ని భారత్ గెలచుకుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. ధోని నాయకత్వంలో భారతదేశం రెండు వరల్డ్ కప్ టైటిల్స్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 లో భారతదేశంలో వన్డే ప్రపంచ కప్. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. దీంతో ఐసీసీ టోర్నమెంట్లను గెలిచిన అనుభవం కోహ్లీ సేనకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టోర్నమెంట్లలో అంత మంచి రికార్డు లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
మ్యాచ్‌లో ఉన్నప్పడు ధోని బ్రెయిన్ ఎంత చురుకుగా పనిచేస్తోంది. ప్రత్యర్ధుల వ్యూహల్ని, పిచ్ పరిస్థితుల్ని అంచనా వేయడంలో మిస్టర్ కూల్ ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే.. ఈ సారి టీ-20 కప్ నెగ్గడం కోసం బీసీసీఐ ధోనీని మెంటార్ గా ఎంపిక చేసింది.
ఇది కూడా చదవండి: T20world cup: టీమిండియా స్క్వాడ్ ఇదే