Tuesday, November 26, 2024

టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై ఫిర్యాదు..

టీ20 ప్రపంచక‌ప్‌ కు టీమిండియా స్కాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. కాగా ఈ సారి వరల్డ్ కప్ లో మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని మెంటర్‌గా టీమ్ తోనే ఉండనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎమ్మెస్ ధోనిని టీమ్ మెంటర్ గా నిమయించడంపై ఇప్పుడు వివాదం నెలకొంది. దీనిపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు అందింది. లోధా క‌మిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల క్లాజ్‌ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ స‌భ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులకు లేఖ రాశాడు.

లోధా క‌మిటీ సిఫార్సుల మేరకు ఓ వ్య‌క్తి రెండు ప‌ద‌వులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు. అయితే, దీనిపై అపెక్స్ కౌన్సిల్ త‌మ లీగ‌ల్ టీమ్‌ను సంప్ర‌దించాల్సి ఉందని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉంటే, ధోని ఇప్ప‌టికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతను టీమిండియాకు మెంటర్‌గా కూడా ఎంపిక కావడంతో వివాదం మొదలైంది. కాగా, సంజీవ్‌ గుప్తా గ‌తంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల ఫిర్యాదులు చాలా చేశాడు.

ఇది కూడా చదవండి: ధోని ఉన్నాడంటే కప్ మనదేనా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement