ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో ఇవాళ చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్ పార్లమెంట్ సాక్షిగా భగవద్గీతపై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో ఈ ఘనత సాధించిన తొలి సభ్యుడిగా ఆయన నిలిచారు.
అతను పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి.. ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో ఆస్ట్రేలియా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అతన్ని ఎన్నుకున్నాయి. అనంతరం నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం.. భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ సెనేటర్ ఘోష్ అని తెలిపాడు.. సెనేటర్ ఘోష్ తన కమ్యూనిటీకి, వెస్ట్ ఆస్ట్రేలియన్ల కోసం బలమైన గొంతుకగా ఉంటారని కోరుతున్నాను అని పేర్కొన్నారు.
అయితే, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా వరుణ్ ఘోష్‌కు స్వాగతం పలికారు. అయితే, పెర్త్‌లో నివాసం ఉంటున్న వరుణ్ ఘోష్ వృత్తిరీత్యా న్యాయవాది.. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లా లో పట్టా పొందాడు.. గతంలో న్యూయార్క్‌లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా పని చేసిన అనుభవం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. వరుణ్ ఘోష్ తన రాజకీయ జీవితాన్ని పెర్త్‌లోని లేబర్ పార్టీతో ప్రారంభించాడు.