Wednesday, November 20, 2024

వాళ్ళను ‘రైతు అమరవీరులు’ గా కేంద్రం గుర్తించాల్సిందే : రేవంత్ రెడ్డి

రైతు ఉద్యమంలో అమరులైన రైతులనూ “రైతు అమరవీరులు”గా గుర్తించాలని ఎంపీ రేవంత్రె డ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 377 కింద రైతు ఉద్యమం, రైతు ఆందోళనలు, మరణాలపై లోక్ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి 100 రోజులు దాటిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ రైతు ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కిసాన్ మహా పంచాయతీ సాగుతుంది. ‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో ముందుకు వెళ్లే మన దేశం రైతు ఉద్యమం పేరిట శీతాకాలంలో రైతులు చనిపోయేలా చేసిందన్నారు. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో వేసవి వేడికి రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన దేశంగా మన భారతదేశాన్ని నిలిపిన రైతులు నేడు అన్నదాత అనే ప్రాథమిక హక్కును కూడా హరించే విధంగా వ్యవసాయ చట్టాలు ఉన్నా యంటూ నిరసిస్తూ రైతులు రోడ్లపై చనిపోయేలా చేస్తున్నారు. బలవంతం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 270 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, అదే సమయంలో వారిని ‘రైతు అమరవీరులు’ గా గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement