Friday, November 22, 2024

ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట

మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ తరఫున ఎంపీ గా గెలిచిన ఎంపీ మాలోత్ కవిత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు పది వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎంపీ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు విచారణ చేపట్టగా..ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి : Tokyo olympics: సెమీస్ లోకి దూసుకెళ్లిన పి.వి సింధు..

Advertisement

తాజా వార్తలు

Advertisement