వరంగల్ : రేవంత్ నాకు వంద ఎకరాలు కాదు.. వంద గజాలు ఉన్నట్లు నిరూపిస్తావా? మానుకోటలో నేను భూకబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయసన్యాసం తీసుకుంటా అని, మరి నిరూపించకుంటే అదే అంబేద్కర్ సెంటర్ లో ముక్కు నేలకు రాస్తావా అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సవాల్ విసిరారు. గిరిజన మహిళా ప్రజా ప్రతినిధి అంటే అంతచులకనా.. ఏం.. ఆరోపించినా చెల్లుబాటవుతుందనే గర్వమా అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే కర్రుకాల్చి మూతిమీద వాతపెడుతా అని మండిపడ్డారు. రేవంత్ నువ్వెంత..! నీ..బతుకెంత.. మహానీయుడు కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయానీది అన్నారు. నువ్వు ఏదో.. ఊహించుకొని వస్తే నిన్ను.. నీ పార్టీని పట్టించుకునే ప్రజలు లేకపోవడంతో పిచ్చెక్కి మొరుగుతున్నావు అన్నారు. జాగ్రత్త ఏది పడితే అది వాగకు, ప్రజలు అసహ్యించుకుంటారు. దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లు.. నువ్వు మరి ఎక్కువ చేస్తే ప్రజలు తరిమికొట్టే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement