Friday, November 22, 2024

Extremely Sorry యూరిన్ బాధితుడి కాళ్లు క‌డిగి క్ష‌మాప‌ణ కోరిన ఎంపి ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్

భోపాల్ – యూరిన్ బాదితుడు దాస్మేష్ కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముక్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌవ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.. అత‌డి కాళ్లు క‌డిగి ఆ నీళ్ల‌ను త‌ల‌పై వేసుకుని పాశ్చాత్తాపం ప్ర‌క‌టించారు.. వివ‌రాల‌లోకి వెళితే సిద్ధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే నిందితుడు దాస్మేష్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా స్పందించి నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయమని ఆదేశించారు. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

అంతే కాకుండా గిరిజన కూలీ దాస్మేష్ రావత్ ను ముఖ్య‌మంత్రి త‌న ఇంటికి ఆహ్వానించారు.. ముఖ్య‌మంత్రి నివాసానికి చేరుకున్న రావ‌త్ కు శివ‌రాజ్ స్వ‌యంగా ఆహ్వానం ప‌లికారు.. గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి దుశ్శాలువ‌తో సత్కరించారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. అత‌డిని ఘ‌నంగా స‌త్క‌రించి బ‌హుమ‌తులు అంద‌జేశారు.. అలాగే రావత్ కు గుర్తుగా ముఖ్య‌మంత్రి నివాస స‌ముదాయంలో ఒక మొక్క‌ను నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement