కొవిడ్ మహమ్మారి తర్వాత సినిమా రంగం ఓ పెద్ద సవాల్‌ని ఎదుర్కొంటోంది. ఈ మధ్యకాలంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటీటీలకే అలవాటు పడుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే అంత బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినమాల్లో కొన్ని మెప్పిస్తే, మరికొన్ని నిరాశ పరిచాయి. అట్లా డీలాపడ్డ సినామాలన్నీ ఓటీటీ బాటపట్టాయి. అవేంటో చదివి తెలుసుకుందాం!
గోపీచంద్, రాశి ఖన్నా నటించిన “పక్కా కమర్షియల్” మూవీ ఆల్ రెడీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహాలోనూ ఆగస్టు 5వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి భారీగా ప్రచారం జరిగినప్పటికీ.. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అంతగా ఆదరణ రాలేదు. దీంతో ఇది
బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయ్యిందనే చెప్పవచ్చు.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలారా ఫేమ్ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన సినిమా “హ్యాపీ బర్త్ డే”. ఆగస్టు 8న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
రామ్ పోతినేని “ది వారియర్” రొటీన్ కథ, స్క్రీన్‌ప్లే కారణంగా ఈ కాప్-డ్రామా ఫెయిల్యూర్ కి దారితీసింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ డిస్నీప్లస్‌హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది.
నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా సినిమా “థాంక్యూ”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి నటించారు. అయితే.. ఈ సినిమా ప్రారంభం రోజూ బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తాపడింది. వసూళ్లు లేక క్రాష్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 20వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది.
గత జులై లో రిలీజ్ అయిన సినిమాల్లో రవితేజ హీరోగా వచ్చిన “రామారావు ఆన్ డ్యూటీ” ఒకటి. ఈ సినిమా కూడా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ మూవీ కూడా త్వరలో OTT రూట్‌లోకి వచ్చే చాన్స్ ఉందంటున్నారు. నిర్మాత ముందుగా OTT విడుదల కోసం చర్చలు జరుపుతున్నారు. ఆగస్టులో Sony Liv యాప్‌లో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.