ఓటీటీలోకి తెలుగు సినిమాల ఎంట్రీపై టాలీవుడ్ నిర్మాతలు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50రోజుల తర్వాత మాత్రమే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని తేల్చారు. ఈ మేరకు బుధవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే జులై 1 తర్వాత ఒప్పందాలు జరిగే సినిమాలకే ఈ నిబంధన వర్తింపజేయాలని కూడా నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఓటీటీలోకి త్వరితగితిన సినిమాలు విడుదల అవుతుండటంతో అగ్ర హీరోలకు భారీ నష్టం జరుగుతోందని, వారి ఇమేజీ కూడా తగ్గిపోతోందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంతకుముందు అన్నారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు నిర్మాతలు ఇవ్వాల భేటీ అయినట్టు తెలుస్తోంది. బన్నీ వాసు రిక్వెస్ట్ మేరకే టాలీవుడ్ నిర్మాతలు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.