Friday, November 22, 2024

సినిమాలకి విలువలు ఉండాల్సిన అవసరం లేదు.. నాగబాబు

సినిమాలోని హింస.. ఇతర విషయాల గురించి కొందరు చేస్తున్న విమర్శలపై నటుడు నాగబాబు స్పందించారు.సినిమా అనేది ఈ మధ్య కాలంలో పూర్తిగా వ్యాపార ధోరణి గా మారిందని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా నిర్మాణం విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై నాగబాబు స్పందిస్తూ కమర్షియల్ గా సక్సెస్ ను దక్కించుకోవడం కోసమే ప్రతి ఒక్కరు సినిమాలను నిర్మిస్తున్నారన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నాడు. సెన్సార్ బోర్డు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటుంది. కనుక వివాదాస్పద విషయాలను సెన్సార్ బోర్డు ముందుగానే చూసుకుంటుంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా అనేది వ్యాపార ధోరణి తో తీస్తున్నది కనుక విలువలు ఉండాల్సిన అవసరం లేదు అంటూ నాగబాబు వ్యాఖ్యలకు చాలా మంది సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement