సమ్మెబాటపట్టారు సినీ కార్మికులు. వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 24 విభాగాల కార్మికులు నేటినుంచి సమ్మెకు పిలుపునిచారు. ఇందులో భాగంగా సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు.
దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్ పరిసరాల్లో 20కిపైగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది.నేడు ఫిలిం ఫెడరేషన్ వద్ద 24 విభాగాల కార్మిక సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించనున్నారు. కృష్ణానగర్‌లోని యూనియన్ ఆఫీసులకు కార్మికులు చేరుకుంటున్నారు. కాగా, తెలుగు ఫిలిం చాంబర్ సభ్యులు నిర్మాతల మండలితో భేటీకానున్నారు. కార్మికుల వేతనాలపై చర్చించనున్నారు.