తమ వేతనాలు పెంచే వరకు సినిమా షూటింగ్ లు జరగవని సినీ కార్మికులు స్పష్టం చేశారు. ఈ మేరకు రేపటి నుంచి తెలుగు సినీ కార్మికుల సమ్మె ప్రారంభం కానుంది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు రేపటి నుంచే సమ్మెకు దిగుతున్నారు. అంతేకాదు.. ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపు నిచ్చారు. వేతనాలు పెంచే వరకూ షూటింగ్‌లు జరగవని సినీ కార్మికులు స్పష్టం చేశారు. దీంతో సినిమా షూటింగ్ లు బంద్ కానున్నాయి. ఇక ఇటు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ..అటు సినీ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో వేతన సవరణ ఒప్పందం వెంటనే కుదుర్చుకోవాలని ఫెడరేషన్ కార్యవర్గంపై ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి 24 యూనియన్ల కార్మికులు వచ్చారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement