టాలీవుడ్ మూవీ బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన హీరో ప్రభాస్ … ఆ తర్వాత నటించిన సాహో, రాథేశ్యామ్ , అది పురుష్ మూవీలు నిరాశ పరిచాయి.. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ కోసం కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను నమ్ముకున్నాడు.. దీంతో సలార్ మూవీకి బీజం పడింది.. రెండు బాగాలుగా రూపొందే ఈ మూవీ తొలి భాగం “సలార్ – ది సీజ్ ఫైర్ ” నేడు విడుదలైంది.. జగపతి బాబు, ఈశ్వరీరావు, శృతి హాసన్ ,పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటించిన ఈ మూవీ తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను స్వంతం చేసుకుంది..
టాప్ దర్శకుడు రాజమౌళి బహుబలి మూవీ ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తే…. తన కెజిఎప్ కోసం గోల్ట్ మైన్ ఎస్టేట్ ని బ్యాక్ డ్రాప్ చేసుకున్న ప్రశాంత్ నీట్ .ఇక సలార్ మూవీ కోసం ఈసారి ఏకంగా ఖాన్సార్ సామ్రాజ్యాన్ని ఎంచుకున్నాడు .. సలార్ మూవీ కథ పక్కన పెడితే…. ఓ పెద్ద నేర సామ్రాజ్యం… అందులో సింహసనం కోసం జరిగే ఎత్తులు,,, ఓ స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టే యోధుడు… హిమపర్వత శిఖరమంతా కటౌట్ తో ఉన్న కుమారుడు తల్లి మాట జవదాటని సెంటిమెంట్ సీన్స్…కత్తి పడితే వేల మంది హతం చేసుకుంటూ యాక్షన్ సన్నివేశాలు…హీరో ఎలివేషన్ సీన్స్, ఆపై మెలో డ్రామాను రంగరించి తీర్చి దిద్దిన మూవీ సలార్.. అన్ని సమపాళ్ల వేయడంతో ప్రభాస్ నటనతో దానిని మరో ఎత్తుకు తీసుకెళ్లాడు… సాహో అనేలా నటించి అభిమానులను అలరించనడంతో ఎటువంటి సందేహం లేదు..
కథ విషయానికి వస్తే … దేవా (ప్రభాస్) ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామంలో అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మెకానిక్ గా పని చేస్తున్న అతన్ని ఒక హింసాత్మక గతం వెంటాడుతూ ఉంటుంది. తల్లి మాట మేరకు అతను హింసకు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటి అతను అమెరికా నుంచి వచ్చి శత్రువులకు టార్గెట్ గా మారిన ఆద్య (శృతిహాసన్)ను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలోనే దేవా అత్యంత భయంకరమైన ఖాన్సార్ నేర సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సామ్రాజ్యం నేపథ్యం ఏంటి.. దాంతో దేవాకున్న సంబంధమేంటి… అతడి గతం ఏంటి.. ఆద్యను కాపాడే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
ఈ కథను హత్తుకునే చెప్పడంలో నీల్ సక్సెస్ అయ్యాడు.. బాహుబలి తర్వాత ప్రభాస్ ను తన అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు చూడాలనుకుంటారో అలా చూపించాడు ప్రశాంత్. ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకుంటే మాస్ కు ఎలా పూనకాలు తెప్పించవచ్చో ప్రశాంత్ మరోసారి నిరూపించాడు.. ఇక మూల కథను ఇద్దరు స్నేహితుల మధ్య బంధం నేపథ్యంలో నడిపించాడు ప్రశాంత్. అలాగే తల్లి సెంటిమెంట్ ను బాగానే వాడుకున్నాడు.. ద్వితీయార్థంలోను ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అయితే బాగానే పేలాయి. కథపరంగా సినిమా చివర్లో అనేక ప్రశ్నలు విడిచి పెట్టాడు ప్రశాంత్. అవన్నీ సలార్-2 లో చూడాల్సిందే. చివర్లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఇచ్చిన ట్విస్టు, తనను ఎలివేట్ చేసిన తీరు అభిమానులను మెప్పిస్తాయి. రెండో భాగం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు అన్న ఆశలు రేకెత్తిస్తుంది క్లైమాక్స్. ఇక బసూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, భువనగౌడ సినిమాటోగ్రఫితో ఈ మూవీని మరో లోకానికి తీసుకెళ్లాడు నీల్.. సినిమాను చాలా రిచ్ గా తీశాడు దర్శకుడు .. అన్ని బాగానే ఉన్నా ఈ మూవీలో ఎప్పుడు ఏ పాత్ర వస్తుందో… ఆ తర్వాత ఎందుకు కనిపించకుండా పోతుందో.. ఒక సన్నివేశానికి… మరో సన్నివేశానికి మధ్య లింక్ లేకుండా పోవడం..గజిబిజి గందరగోళంగా ఉంటుంది.. అయితే వాటన్నింటిని ప్రభాస్ తన నటనతో మరిచిపోయేలా చేశాడు … చాలా కాలం తర్వాత ప్రభాస్ కు ఓ మంచి హిట్ ఈ మూవీ ద్వారా లభించినట్లే…