రష్యా ఉక్రెయిన్ మద్య యుద్ధం వల్ల ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్తితిలో యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వందలాది మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించింది. భారతీయ రాయబార కార్యాలయం విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉందని.. అన్ని ఇమ్మిగ్రేషన్, అధికారిక పనులలో సహాయం చేస్తుందని, పూర్తి భద్రత మధ్య వారిని ఖాళీ చేయించి, ఆహారం.. నీరు కూడా అందించినట్లు రాయబార కార్యాలయ అధికారి చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో దిగింది..
రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ పౌరులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకెళ్లారు, అక్కడినుంచి వారిని ఎయిర్ ఇండియా విమానంలో ఇండియాకి తరలించవచ్చు. 219 మందితో ఓ విమానం ఇప్పటికే ముంబైకి బయలుదేరగా.. మరో రెండు విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు విమానాల్లోని భారతీయుల్లో 13 మంది తెలుగు విద్యార్థులున్నారు. ఓ విమానంలో 8 మంది విద్యార్థులు ఉండగా..మరో విమానంలో 5 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..