Saturday, November 23, 2024

యుద్ధక్షేత్రంలో రుద్రభూమి.. మేరియుపోల్‌లో శవాల గుట్టలు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు పెద్దఎత్తున మారణహోమానికి కారణమైంది. సైనికస్థావరాలతోపాటు సాధారణ పౌరులనూ పుతిన్‌సేనలు లక్ష్యంగా చేసుకోవడంతో భారీసంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోకి ప్రధాన ఓడరేవు నగరమైన మేరియుపోల్‌ పరిస్థితులు దయనీయంగా మారాయి. ఈ నగరాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి దాకా 2500కు పైగా సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వం మృతులకు సామూ#హక అంత్యక్రియలు నిర్వ#హస్తోంది. ఈ నగరంలో దాడులు మొదలైన 12 రోజుల్లో 1500లకు పైగా జనం మృత్యుఒడికి చేరినట్లు ఉక్రెయిన్‌ విదేశాంగమంత్రి దిమిత్రో కుబేలా వెల్లడించారు. ఈ సామూహిక అంత్యక్రియలకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు.

‘మేరియుపోల్‌ ఇప్పుడు ఈ భూమి మీదనే అత్యంత దారుణమైన మానవతా విపత్తును ఎదుర్కొం టోంది. 12 రోజుల్లో 1582 మంది పౌరులు మరణించారు. శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. గత్యంతరం లేక కొందరిని ఇలా సామూ#హకంగా పూడ్చిపెట్టాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌ను ఎదుర్కోలేని పుతిన్‌ ప్రభుత్వం.. నిరాయుధులపై బాంబులు వేస్తోంది. సామాన్య పౌరులకు అందుతున్న మానవతా సాయాన్ని సైతం అడ్డుకుంటోంది’ అని అన్నారు. రష్యా యుద్ధ నేరాలను ఆపేందుకు మాకు యుద్ధ విమానాలు కావాలి అని ప్రపంచ దేశాలను కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సామూ#హక అంత్యక్రియలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయమందిస్తున్నాయి. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త వొలోదిమిర్‌ బైకోవ్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ మారణకాండకు ముగింపు పలకాలి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయం నాకు తెలియదు. దీన్ని ఎవరు మొదలుపెట్టారన్నది కూడా అనవసరం. కానీ ఈ యుద్ధానికి ముగింపు పలకాలి’ అని పేర్కొన్నారు.

కీవ్‌లో క్షిపణి దాడులు.. పౌరులు మృతి..

ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం సోమవారం 19వరోజుకు చేరింది. కీవ్‌ శివారు ప్రాంతాలపై రష్యా క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. రష్యా దళాలు కీవ్‌కు వాయువ్యంగా ఉన్న ప్రాంతాలపై రాత్రిపూట ఫిరంగి దాడులు జరిపి, రాజధానికి తూర్పున ఉన్న పాయింట్లను లక్ష్యంగా చేసుకున్నాయని కీవ్‌ మేయర్‌ తెలిపారు. తూర్పున ఉన్న బ్రోవర్‌ టౌన్‌ కౌన్సిలర్‌ రష్యా దాడుల్లో మరణించినట్లు ప్రాంతీయ పరిపాలనా చీఫ్‌ ఒలెక్సీ కులేబా తెలిపారు. ఇర్పిన్‌, బుచా, హోస్టోమెల్‌ వాయువ్య పట్టణాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రష్యా దళాలు పశ్చిమాన దాడులు విస్తరిస్తున్నప్పటికీ, గత 24 గంటల్లో పెద్దగా పురోగతి సాధించలేదని చెప్పారు. ఉక్రెయిన్‌ దళాల ఎదురుకాల్పులను తప్పించుకునేందుకు రష్యన్‌ బలగాలు చర్చిలు, ఇతర పౌర మౌలిక సదుపాయాలలో ఫైరింగ్‌ పొజిషన్లు, సైనిక పరికరాల ఏర్పాటును చేసుకున్నాయని ఆరోపించారు. రష్యా షెల్లింగ్‌లో మంటలు చెలరేగడంతో కీవ్‌లోని ఓ భవనం కుప్పకూలింది.

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పుతిన్‌ దళాల దాడితో భవనం మంటల్లో చిక్కుకుంది. ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రి పాలయ్యారు. మరో తొమ్మిది మందికి అక్కడికక్కడే చికిత్స అందించారు. భవనం నుంచి 63 మందిని భద్రత సిబ్బంది రక్షించారు. మంటలు అదుపులోకి వచ్చాయి అని స్థానిక అధికారులు వెల్లడించారు. గతవారం మేరియుపోల్‌లో జరిగిన బాంబుదాడిలో నిండుగర్భిణి గాయపడింది. ఆస్పత్రికి తరలించిన తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. పరిస్థితి విషమించడంతో తల్లిdబిడ్డ మరణించారని అధికారులు తెలిపారు. రష్యా మాత్రం ఈ ప్రకటనను ఖండించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను కూడా నకిలీవని పేర్కొంది. ఇక డొనెట్క్స్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ క్షిపణి దాడిలో 20మంది మరణించారని రష్యా వెల్లడించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement