Friday, November 22, 2024

త‌ల్లితో వివాహేత‌ర సంబంధం.. వ్య‌క్తిని దారుణంగా చంపిన కొడుకు..

వివాహేత‌ర సంబంధం వ‌ల్ల ఎంతో మంది కుటుంబాలు చిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. త‌న త‌ల్లితో వివాహేత సంబంధం పెట్టుకున్న వ్య‌క్తిని కొడుకు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న బిహార్‌లోని బ‌ర్ ప్రాంతంలో ఆల‌స్యంగా వెలుగుచూసింది. మృత‌దేహాన్ని రైల్వేట్రాక్‌పై ప‌డేసి నిందితులు ప‌రార‌య్యారు. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కార‌ణంగానే ఈ హ‌త్య జ‌రిగింద‌ని వెల్ల‌డైంది. వివ‌రాల్లోకి వెళితే త‌న త‌ల్లితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న మోనును క‌డ‌తేర్చాల‌ని నిందితుడు బాద‌ల్ నిర్ణ‌యించుకున్నాడు. మ‌రో ఇద్ద‌రు స్నేహితులు అంకిత్‌, భ‌జోలతో క‌లిసి మోనును హ‌త్య చేశాడు. తొలుత వీరు మోనుకు మ‌ద్యం తాగించి ఆపై క‌త్తితో పొడిచి చంపారు. హ్య‌త కేసులో ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement