Friday, November 22, 2024

మంద‌లించిన త‌ల్లిని సుఫారి ఇచ్చి హ‌త్య చేయించిన బాలిక‌..

మాస్కో: బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటోందని మందలించిన తల్లి మాటలను సహించని ఓ కూతురు సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ సంఘ‌ట‌న ర‌ష్యా రాజ‌ధాని మాస్కో లో చోటు చేసుకుంది.. అక్క‌డి ప‌త్రిక‌ల క‌థ‌నం ప్ర‌కారం మాస్కో నగరానికి చెందిన ఒక మహిళ తన 14 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా ఉంటోంది. ఆ బాలిక తన స్నేహితుడితో సన్నిహితంగా ఉండేది. వారిద్దరూ చనువుగా ఉండటం గమనించిన తల్లి తన కుమార్తెకు దూరంగా ఉండాలని బాలుడిని హెచ్చరించింది. అతడిని మరోసారి కలవకూడదని తన కూతురిని గట్టిగా చెప్పింది. ఇదంతా నచ్చని బాలిక తన తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంది. ఆమెను హత్య చేయించడానికి కుట్రపన్నింది. స్నేహితుడితో కలిసి ఇద్దరు కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చింది. వారు అత్యంత కిరాతకంగా ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి బెడ్‌ లోపల పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఓ వ్యక్తి చెత్తకుప్ప వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన పోలీసులు బాలికను అరెస్టు చేశారు. బాధితురాలి హత్యకు కుట్ర పన్నిన, హత్య చేసిన నిందితులందరూ 14 నుంచి 17 ఏళ్ల వయసులోపు వారేనని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement