Monday, November 25, 2024

Big Story | కబళిస్తున్న కేన్సర్‌.. బాధితుల్లో అత్యధికులు యువతే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యువకులను క్యాన్సర్‌ వ్యాధి కబళిస్తోంది. యువతుల కంటే ఎక్కువగా యువకులే క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఈ మేరకు దేశంలో 0-19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యూత్‌పై జరిపిన అధ్యయన అంశాలను ప్రముఖ వైద్య అధ్యయన జర్నల్‌ లాన్సె ట్‌ ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 0-19 సంవత్సరాల యువత మెడికల్‌ రికార్డులను పరిశీలించారు. జనవరి 2005 నుంచి జనవరి 2019 మధ్య రికార్డులను పరిగణనలోనికి తీసుకున్నారు. అదే సమయంలో ఢిల్లి, మద్రాసు నగరాల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి జనాభాను కూడా పరిశీలించారు. క్యాన్సర్‌ బారిన పడిన యువతలో ఎక్కువ మందికి వ్యాధి విషమిస్తోందని తేలింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతలో అనేక మందికి స్టెమ్‌ సెల్‌ చికిత్స చేయాల్సి వస్తోంది.

క్యాన్సర్‌ బారిన పడిన యువతలో యువకులకే వివిధ దశల్లో క్యాన్సర్‌ చికిత్సను అందించాల్సి వస్తోంది. అయితే అమ్మాయిల్లో ఈ అవసరం తక్కువగా ఉంటోంది. క్యాన్సర్‌ బారిన పడిన యువకుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని లాన్సెట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. దేశంలో రాబోయే రోజుల్లో లక్ష కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని అంచనా. యువకులు పెద్ద సంఖ్యలో క్యాన్సర్‌ బారిన పడుతున్న పరిస్థితులకు దురలవాట్లే ప్రధాన కారణమని అధ్యయనం తేల్చింది. లంగ్‌ క్యాన్సర్‌ కేసుల్లో 90శాతం సిగరేట్‌ వంటి పొగాకు ఉత్పత్తుల విని యోగం వల్లనేనని తేలింది.

- Advertisement -

దూమపాణం ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నా చాలా మంది యువత తేలిగ్గా తీసుకుంటున్నారని లాన్సెట్‌ జర్నల్‌ స్పష్టం చేసింది. సిగరేట్‌, హుక్కా వినియోగాన్ని ఎంత తొందరగా విడిస్తే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది యువత ఇటీవలి కాలంలో సిగరేట్‌కు బదులుగా హుక్కాకు అలవాటు పడుతున్నారు. అయితే హుక్కాలో పొగాకు కలిగిన మిశ్రమాలను ఆవిరి చేయడంతో సిగరేట్‌లో కంటే అనేక రసాయనాలు హుక్కా పొగలో ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హుక్కాపొగలో 50 కంటే ఎక్కువ క్యాన్సర్‌ కారకాలను గుర్తించారు. హుక్కాలోనే నికోటిన్‌ పరిమాణం సిగరేట్‌లో కంటే అధికంగా ఉంటుందని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement