Monday, November 18, 2024

రష్యా చమురులో అధిక శాతం రిలయన్స్‌కే.. చౌక చమురుతో ప్రైవేట్‌ కంపెనీలకు లాభాలు

రష్యా నుంచి మన దేశం చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్నది. గతంలో మన దేశానికి రష్యా చమురు దిగుమతుల వాటా కేవలం 1 శాతంగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇది 35 శాతానికి చేరింది. ఉక్రెయిన్‌ పై దాడితో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయ. దీంతో రష్యా రాయితీ ధరలకే చమురును సరఫరా చేస్తోంది. మన దేశానికి భారీగా వస్తున్న చౌక చమురు మూలంగా దేశ ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదు. చౌక ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ రిటైల్‌ ధరలు మాత్రం తగ్గడంలేదు.

ఇందుకు ప్రధాన కారణం మన దేశానికి వస్తున్న చమురులో 45 శాతం వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీలకే వెళ్తున్నట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా వెల్లడించింది. దేశ ప్రజలకు నేరుగా ప్రయోజనం కలగకపోవడానికి ప్రైవేట్‌ రిఫైనరీలకు చమురు భారీగా వెళ్లడమే కారణం. చౌక చమురు మూలంగా ప్రైవేట్‌ రంగ చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడుతున్నాయి. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ దేశాలు యూరోపియన్‌ దేశాలతో పాటు, పశ్చిమాసియా దేశాలకు చమురు ఎగుమతి చేస్తున్నాయి.

ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో భారత్‌ సగటున రోజుకు రష్యా నుంచి 8,70,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇది మొత్త మన దేశ చమురు దిగుమతుల్లో 20 శాతానికి సమానం. దీంల్లో 3,85,000 బారెళ్ల చమురు రిలయన్స్‌, నయారా కంపెనీలకే వెళ్లినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం సంస్థలు 4,84,000 బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా ఇస్తున్న రాయితీ మూలంగా ప్రైవేట్‌ చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత ప్రైవేట్‌ కంపెనీలు వేగంగా నిర్ణయం తీసుకుని రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకోవడం ప్రారంభించాయి. దీని వల్ల కూడా ఈ కంపెనీలు ఎక్కువ లాభపడ్డాయి.

- Advertisement -

రష్యా నుంచి మన దేశానికి ఫిబ్రవరిలో చమురు దిగుమతులు మరింత పెరిగాయి. ప్రస్తుతం మన దేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. గత 5 నెలలుగా రష్యా ఇలా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2023 ఫిబ్రవరిలో రికార్డ్‌ స్థాయిలోరోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు దిగుమతి అయినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్‌, సౌదీ అరేబియా రెండు కలిసి మన దేశానికి సరఫరా చేస్తున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున చమురు ఎక్కువగా ఉంది.
రష్యా నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు భారీగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తే, దాని ఫలితాలను వినియోగదారులకు అందించవచ్చిన ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement