Monday, October 21, 2024

దసరా బరిలో సినిమాలే సినిమాలు

టాలీవుడ్‌కు సంక్రాంతి, సమ్మర్ సీజన్‌ల తరహాలో దసరా సీజన్ కూడా చాలా ముఖ్యమైనదే. ఈ సీజన్‌లోనూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ వాయిదా పడిందన్న ఇన్‌సైడ్ టాక్‌తో పలు సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి.

ఈ జాబితాలో మెగా హీరోల సినిమాలు ఉండటం విశేషం. అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్, 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం, అదేరోజున అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలవుతున్నాయి. మరోవైపు అక్టోబర్ 14న అజయ్ భూపతి మల్టీస్టారర్ మూవీ మహాసముద్రం విడుదల కానుంది. దసరా బరిలోనే నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమా అఖండ కూడా విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఆర్య, విశాల్ మల్టీస్టారర్ మూవీ ‘ఎనిమీ’కూడా దసరా పండగకే రానుంది. ఇలా దసరా సీజన్‌కు బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement