Sunday, November 24, 2024

జాబ్ లేక హ్యుమ‌న్ ట్రాఫికింగ్.. బంగ్లా నుంచే చొర‌బాట్లు ఎక్కువ‌..

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ వైపునున్న సరిహద్దుల ద్వారా గత ఐదేళ్ల లో 6,712మంది చొరబాట్లకు ప్రయత్నించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లతో పోల్చితే 2021లో మొత్తం 1,628 చొరబాటు ప్రయత్నాలు జరిగాయని, 18 మంది చొరబాటుదారులు హతమయ్యారని ప్రభుత్వ డేటా వెల్లడించింది. హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2020లో 1,252 మంది పట్టుబడ్డారు. 2019లో 1,408 మంది, 2018లో 1,173 మంది, 2017లో 1,251 మందిని సరిహద్దు భద్రతదళం అరెస్టుచేసింది. మొత్తంగా 41మందిని కాల్చి చంపినట్లు వెల్లడించింది. 2017- 2021 మధ్య బీఎస్‌ఎఫ్‌ నిర్వహించిన కార్యకలాపాల ఆధారంగా డేటాను క్రోడీకరించింది.

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పట్టుబడిన 268 మంది చొరబాటుదారులలో 60 మంది రాజస్థాన్‌, 19 మంది జమ్మూ, 156 మంది పంజాబ్‌, 33 మంది రాజస్థాన్‌లో అరెస్టయినట్లు తెలిపింది. భారత్‌-బంగ్లా సరిహద్దు నుండి పట్టుబడిన 6,444 మంది చొరబాటుదారులలో దక్షిణ బెంగాల్‌ నుండి గరిష్టంగా 4,796 మంది, ఉత్తర బెంగాల్‌ నుండి 585, త్రిపుర నుండి 558, మేఘాలయ నుండి 248, గౌహతి నుండి 214 మంది, మిజోరాం- కాచర్‌ నుండి 43 మంది పట్టుబడ్డారు. బంగ్లాదేశ్‌ నుండి భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించిన చొరబాటుదారులలో ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చేవారేనని, వారంతా మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement