సీరియస్‌గా ఏ పుస్తకమో చదువుకుం టుంటే బుగ్గమీద కసుక్కున సూది దిగినట్లు చుర్రుమంటుంది. ఫట్ మని ఒక్కటిచ్చి దాన్ని అక్కడికక్కడే చంపేయాలనుకుంటాం. కానీ జరిగేది మాత్రం మన చెంప మనమే పగలగొట్టుకోవడం మన మనసులో అనుకున్నది దానికి ఎలా తెలుస్తుందో రెప్పపాటులో చేతికి అందకుండా ఎగిరిపోతుంది. మరు నిమిషంలో వెక్కిరిస్తున్నట్లుగా మళ్లీ మన చెవి దగ్గర జుయ్య్ మని మోత. పాడు దోమలంటూ వాటిని తిట్టుకోనిదే రోజు గడవదు. వర్షాకాలం వచ్చి పట్టుమని నాలుగు వానలు కురిశాయో లేదో ఎప్పటిలాగే ఇళ్లలో దోమల గోల మొదలయింది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసులూ పెరుగుతున్నాయి. వానాకాలం వచ్చేసింది ఇక గుయ్ గుయ్ అంటూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వార్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలు పెరిగిపోతున్నాయి. డ్రైనేజీలు, ఇంటి పరిసరాల్లో ఉన్న గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని వృద్ధి చెంతున్నాయి. వర్షాలకు పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారుతోంది. మురికి కాలువలు, గుంతలు, నీటి నిల్వ కేంద్రాలు దోమల ఉత్పత్తికి నిలయాలుగా మారుతున్నాయి..
దోమల నివారణకు ప్రత్యేక చర్యలేవీ..
దోమల నివారణ ప్రభుత్వం ప్రత్యే క చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతు న్నారు. పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తుండడంతో ఫాగింగ్ చేసి.. దోమలను అరికట్టాలని కోరుతు న్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు దోమలు విపరీతంగా వస్తున్నా యని సాయంత్రం వేళలలో ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు. పారుశుధ్య నిర్వహణ కొన్ని ప్రాంతాల్లో అధ్వానంగా తయారైందని చెత్త పేరుకుపోయి దోమలు అక్క దోమలు వృద్ధి చెందుతు న్నాయని.. ఎప్పటి చెత్త అప్పుడే తీసి వేసేలా పారిశుధ్య నిర్వహణ ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
దోమల నివారణకు..
వర్షాకాలంలో మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. లార్వా దశలోనే దోమల నివారణకు చర్యలు చేపట్టాలి దోమల నివారణకు మాలథియాన్, సింథటిక్ పైరత్రాయిడ్, డీడీటీ- వంటి దోమల మందు మురికి గుంతలలో పిచికారి చేయాలి. ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు పొగ పె ట్టాలి. నీటి నిల్వల్లో దోమలు వృద్ధి చెంద కుండా అబేటు- మందు స్ప్రే చేయాలి. దోమతెరలు వాడటం, ఇంటి కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవాలి. ఇంటిలోపల, బయట నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత -టైర్లు, ఖాళీ డబ్బా టలు, పనికిరాని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎయి ర్‌కూలర్లు, ప్లnవర్వాజ్, పూలకుండీలలో నీటిని తరచూ మార్చాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.