Wednesday, November 20, 2024

కోవిడ్ సెంటర్‌గా మారిన మసీదు

దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా బారిన పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో గుజరాత్ వడోదర నగరంలోని జహంగీర్ పూర్ లోని ఓ మసీదు నిర్వాహకులు అందరికీ స్ఫూర్తిని కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు. మసీదును కోవిడ్ సెంటర్ గా మార్చేశారు. అన్ని వర్గాల వారికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం గ్రౌండ్ ఫ్లోర్ ను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు ఇక్కడ ఉండటానికి అన్ని వ‌స‌తులు క‌ల్పించారు.

మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదుకు మించిన సదుపాయాలు ఎక్కడా లేవని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని… ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని… అందుకే మసీదును కోవిడ్ సెంటర్‌గా మార్చామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి రంజాన్ నెల కంటే బెటర్ టైం ఇంకేముంటుందని, అందుకే పవిత్ర మాసంలోనే మసీదును కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చేశామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement