Saturday, November 23, 2024

అమెరికాకు మాస్కో హెచ్చరికలు.. రష్యా ఆస్తులు జప్తు చేస్తే సంబంధాలు కట్‌

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా జోక్యం మితిమీరితే, అత్యధికంగా అమెరికన్లు ప్రత్యక్ష బాధితులు అవుతారని మాస్కో అగ్రరాజ్యాన్ని శనివారం హెచ్చరించింది. రష్యాకు చెందిన ఏ ఆస్థులైనా అమెరికా జప్తు చేయడం జరిగితే, మాస్కోకు అమెరికాకు మధ్య ఉన్న అన్ని సంబంధాలు రద్దవుతాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో శనివారం నార్త్‌ అమెరికా విభాగాన్ని హెచ్చరించినట్లు టాస్‌ వెల్లడించింది.

రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చర్యలకు పాల్పడితే, మాస్కో – వాషింగ్టన్‌లకు మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతింటాయని హెచ్చరించినట్లు అలెగ్జాండర్‌ డార్చీవ్‌ టాస్‌కు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై వేలాది మిలటరీ ట్రూపులను పంపింది. ఆ చర్యను ప్రత్యేక మిలటరీ చర్యగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement