దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో కంపెనీలు కూడా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఎంజీ మోటార్స్ ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నది. జెడ్‌ఎస్ ఈవీ-2022 మోడల్ ఎస్‌యూవీతో మార్కెట్‌లోకి రానుంది. అయితే యూకేలో ఈ కారు ధరను కంపెనీ ప్రకటించింది. 28,190 పౌండ్ల నుంచి 34,690 పౌండ్ల మధ్య ఉండనుంది. మన దేశ కరెన్సీలో అయితే.. రూ.28.48 లక్షల నుంచి రూ.35.05 లక్షల వరకు ఉండనుంది. ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ-2022 రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభ్యం అవుతున్నది. 51 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, రెండోది 73 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.
ఈ 73 కేడబ్ల్యూ వాటర్ కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పవర్డ్ ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ – 2022, 622 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 51 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌గల కారు.. 333 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ కారు 156 పీఎస్ పవర్, 280 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 8.2 సెకన్స్‌లో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కొత్త జెడ్‌ఎస్ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దీని బ్యాటరీ సుమారు గంటలో 80శాతం ఛార్జింగ్ అవుతుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఫేస్‌లిఫ్ట్ మోడల్, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీలో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్‌లు, కొత్త టెయిల్ ల్యాంప్‌లతో పాటుగా మరికొన్ని ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంజీ ఈస్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..