Monday, January 20, 2025

TG | ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్… సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు !

ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి @AravindAnnaArmy ఎకౌంట్ ద్వారా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని… దీని వెనుక ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఓ రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ… సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండటమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభ గౌడ్, బండారి లావణ్య, స్వప్న రెడ్డి, సింగిరెడ్డి విమల రెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెంటమ్మ, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement