Tuesday, November 26, 2024

మొరాకో వర్సెస్‌ పోర్చుగల్‌.. ఫిఫాలో మరో బిగ్‌ఫైట్‌

ఫిఫా ప్రపంచకప్‌ 2022లో రేపు మరొక కీలక పోరు జరగనుంది. మొరాకో, పోర్చుగల్‌ జట్లు తలపడనున్నాయి. క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకునేందుకు శక్తివంతమైన స్పెయిన్‌ ఓడించిన తర్వాత మొరాకో జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ప్రి-క్వార్టర్స్‌లో లభించిన ఆశ్చర్యకరమైన గెలుపు వారిని ఇప్పుడు ఫిపా కప్‌ వైపు దృష్టిని మళ్లించింది. వాలిద్‌ రెగ్రగుయ్‌ బృందం ప్రస్తుతం ఖతార్‌లో అద్భుతమైన ఆటతీరును ఆస్వాదిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. ఆఫ్రికన్‌దేశం ఇప్పుడు ఫిఫా కప్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. శనివారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌లో పోర్చుగల్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. దోహాలోని అల్‌ తుమామా స్టేడియంలో ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.

మరోవైపు పోర్చుగల్‌ కూడా సంచలన విజయాలతో దూకుడు మీదుంది. ప్రి-క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను 6-1 గోల్స్‌తో చిత్తుచేసింది. నిన్నటి మ్యాచ్‌లో స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అతడి స్థానంలో 21 ఏళ్ల గొంకలో రామోస్‌ జట్టులోకి వచ్చి, అద్భుత ప్రదర్శన చేశాడు. రామోస్‌ తన జట్టుకు హ్యాట్రిక్‌ గోల్స్‌ చేసి, తిరుగులేని విజయాన్ని అందించాడు. ఫిఫా చరిత్రలో పోర్చుగల్‌ తరఫున రెండవ అతి పిన్న వయస్కుడైన గోల్‌ స్కోరర్‌గా రికార్డుకెక్కాడు. రొనాల్డోను బెంచ్‌కి పరిమితం చేయడం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. అయినా కోచ్‌ ఫెర్నాండో శాంటోస్‌ వాటిని పట్టించుకోలేదు. అది ఆటలో వ్యూహమేనని సమర్థించుకున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, పోర్చుగల్‌తో జరిగే నేటి మ్యాచ్‌లోనూ స్టార్‌ స్ట్రయికర్‌ మరోసారి మైదానం వెలుపలే ఉండొచ్చని తెలుస్తోంది. శాంటోస్‌ మరోసారి అతడిని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతాడని అంటున్నారు. అల్‌ తుమామా స్టేడియంలో నేటి రాత్రి 8.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది.

- Advertisement -

మొరాకో జట్టు (అంచనా):

యాస్పిన్‌ బౌనౌ, అచ్రాఫ్‌ హకీమి, జవాద్‌ ఎల్‌ యామిక్‌, యాహియా అత్తియత్‌ అల్లా, నౌసైర్‌ మజ్రౌయి, అజ్జెడిన్‌ ఔనాహి, సోఫియాన్‌ అమ్రాబత్‌, సెలిమ్‌ అమల్లా, హకీమ్‌ జియెచ్‌, యూసఫ్‌ ఎన్‌ నెసిరి, సోఫియాల్‌

పోర్చుగల్‌ జట్టు (అంచనా):

డియోగో కోస్లా, డియోగో స్టార్టింగ్‌, పెపే, రూబెన్‌ డయాస్‌, రాఫెల్‌ గెరెరో, ఒటావియో, విలియం కార్వాల్హో, బెర్నార్డో సిల్వా, బ్రూనో ఫెర్నాండెజ్‌, గొంకలో రామోస్‌, జోవా ఫెలిక్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement