Wednesday, November 20, 2024

రష్యా గర్జించినా.. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు

ఉక్రెయిన్‌కు సాయంగా నిలుస్తున్న నాటో దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గర్జిస్తున్న నేపథ్యంలో, మరిన్ని ఆయుధాల సరఫరా దిశగా అమెరికా అడుగులేస్తున్నది. తాజాగా 725 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సైనిక సహాయాన్ని పంపుతున్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. కీవ్‌ నగరాలపై ఇటీవల మాస్కో దాడులు తీవ్రమైన క్రమంలో యూకే సహాయాన్నీ ఈ సందర్భంగా శ్వేతసౌధం ప్రస్తావించింది. ఉక్రెయిన్‌ అంతటా పౌరులపై రష్యా క్రూరమైన క్షిపణి దాడులు చేస్తున్నందున, మాస్కో బలగాల దురాగతాలను అడ్డుకునేందుకు ఈ సహాయం చేస్తున్నట్లు యూఎస్‌ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వాషింగ్టన్‌ ప్రకటించిన తాజా ప్యాకేజీలో సరికొత్త మిలటరీ హిమర్స్‌ (హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్‌) కోసం మరింత మందుగుండు సామగ్రి కూడా ఉంది. బిడెన్‌ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు మొత్తంగా 18.3 బిలియన్ల సాయం చేసినట్లు రక్షణశాఖ ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 20 హమర్స్‌పంపింది. రాబోయే కాలంలో మరో 18 హిమర్స్‌ డెలివరీ చేస్తాంఅని రక్షణ అధికారులు తెలిపారు. ఇటీవలి 48 గంటల్లో ఉక్రెయిన్‌ లక్ష్యాలపై రష్యా 80కి పైగా క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో సగానికిపైగా క్షిపణులను ఉక్రేనియన్‌ వైమానికదళం నిర్వీర్యం చేసిందని పెంట గాన్‌లోని సీనియర్‌ రక్షణ అధికారి మీడియాకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement