Sunday, November 24, 2024

Monkeypox: 35 వేలు దాటిన మంకీపాక్స్‌ కేసులు.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. 92 దేశాల పరిధిలో బుధవారం నాటికి 35 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 12 మంది మ్సత్యువాత పడ్డారు. గత వారంతో పోలిస్తే ఈ వారం 20 శాతం కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తెలిపారు. గతవారం దాదాపు 7,500 మంది మంకీపాక్స్‌ బారీన పడ్డారు. దాదాపు అన్ని కేసులు యూరప్‌, అమెరికా దేశాల్లోనే వెలుగు చూశాయన్నారు. పురుషుల స్వలింగ సంపర్కం వల్లే మంకీపాక్స్‌ కేసులు బయటపడుతున్నాయని టెడ్రోస్‌ ఘెబ్రేయెసస్‌ చెప్పారు.

దాదాపు అన్ని దేశాలు మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు తప్పనిసరిగా సిద్ధం కావాలని తెలిపారు. బాధిత సామాజిక వర్గాల నుంచి వ్యాక్సిన్ల కోసం అధిక డిమాండ్‌ ఉందన్నారు. అయితే, మంకీపాక్స్‌ వైరస్‌పై వ్యాక్సిన్ల ప్రభావం పరిమితం అని ఆయా దేశాల నుంచి తమకు వచ్చిన డాటా చెబుతున్నదని చెప్పారు. కరోనా మహమ్మారి మాదిరిగానే ప్రపంచ దేశాల మధ్య మంకీపాక్స్‌ నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్ల లభ్యతలో అసమానతలు పునరావృతం అవుతాయని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement