Wednesday, November 20, 2024

12000మందికి పైగా ర‌ష్యా సైనికుల‌ను హ‌త‌మార్చాం : ఉక్రెయిన్

ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతూ వ‌స్తోంది. ఈరోజు కు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 14వ రోజుకు చేరింది. అయితే పశ్చిమ దేశాల ఆంక్షలను లెక్కచేయని రష్యా, ఉక్రెయిన్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఇప్ప‌టికే పలు నగరాలు రష్యా వశమయ్యాయి. రాజధాని కీవ్‌ స్వాధీనానికి రష్యా సైన్యం తెగ ప్రయత్నిస్తుంది. అయితే ఉక్రెయిన్‌ సైనికులు ధీటుగా ప్రతిఘటిస్తున్నారు. రష్యాపై తమదే పైచేయి అని ఉక్రెయిన్‌ తెలిపింది. రష్యా దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 12,000 మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్‌ ఆర్మీ పేర్కొంది. రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 విమానాలు, 28 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ వ్యవస్థలు, 81 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కీవ్‌, జైటోమిర్, వాసిల్కివ్‌లలో వైమానిక దాడి సైరన్‌లు వివినిపించినట్లు స్థానిక మీడియా సంస్థ కీవ్‌ ఇండిపెండెంట్ తెలిపింది. దీంతో నివాసితులు సమీపంలోని షెల్టర్‌కు వెళ్లాలని అధికారులు సూచించినట్లు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement