Tuesday, November 26, 2024

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలి.. దావోస్‌ సదస్సులో జెలెన్‌స్కీ అభ్యర్థన..

కీవ్‌:అకారణంగా తమపై దండెత్తి, వేలాదిమంది ప్రాణాలు తీసిన రష్యాపై మరిన్న ఆంక్షలు విధించాలని, గరిష్ఠ స్థాయిలో ఆ ఆంక్షలు ఉండాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కోరారు. స్విడ్జెర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. యుద్ధం పేరుతో రష్యా మరింత దూకుడుగా వ్యవహరించకుండా ఉండేలా ఆ ఆంక్షలు ఉండాలని కోరారు. చమురు కొనుగోళ్లపై నిషేధం, రష్యాలోని బ్యాంకులన్నింటితో లావాదేవీల నిలిపివేత, రష్యాతో వాణిజ్యబంధాలను తెగతెంపులు చేసుకోవడంవంటి ఆంక్షలు విధించాలని ఆయన కోరారు. దావోస్‌ సదస్సుకు ప్రపంచ దేశాలనుంచి అత్యున్నత వాణిజ్య ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతారు. వీరిని ఉద్దేశించి జెలెన్‌ స్కీ మాట్లాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement