Friday, November 22, 2024

TS | మరింత కనిష్టానికి ఉష్ణోగ్రతలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఉదయం పూట బయటను రావాలంటేనే జంకుతున్నారు. పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో చలిగాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత ఏడు జిల్లాల్లో పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది. పలు జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు ఉన్నాయని ప్రకటించింది. ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, మెదక్‌, రంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలితో పాటు విపరీతమైన పొగ మంచు కమ్ముకోవడంతో ఇప్పటికే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement