Tuesday, November 26, 2024

కాబూల్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశం

కాబూల్ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. బదులు తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేసిన 24 గంటల్లోనే పెంటగాన్ డ్రోన్‌లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో పేలుళ్ల సూత్రధారి హతమైనట్టు అమెరికా అంటోంది. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయానికి దాడులు ముప్పు మరింత అధికంగా ఉంటుందని కాబూల్‌లోని అమెరికా ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది.

విమానాశ్రయం గేట్ల వద్ద ఉన్న అమెరికా పౌరులంతా అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. కాగా తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ప్రమాదాలన్నింటినీ బేరీజు వేస్తున్నామని, అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. తరలింపులకు ఇంకా మూడు రోజుల సమయమే ఉన్నందున.. ఇకపై నిర్వహించబోయే తరలింపులు అత్యంత ప్రమాదకరమైనవని శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్‌తో తాలిబన్లకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది.

ఈ వార్త కూడా చదవండి: కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 120 ఏళ్ల బామ్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement