Tuesday, November 26, 2024

మూన్‌ దుబాయ్‌ రిసార్ట్‌.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌

విలాసాలకు మారుపేరైన దుబాయ్‌లో మరో కొత్త ఎట్రాక్షన్‌ పర్యాటకులను మరింతగా ఆకర్షించనుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి మూన్‌ ఆకారంలో భారీ లగ్జరీ రిసార్ట్‌ అతి త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది. సుమారు 48 నెలల్లో 725 అడుగుల మూన్‌ దుబాయ్‌ లగ్జరీ రిసార్ట్‌ను నిర్మించడానికి కెనడా ఆర్కిటెక్చరల్‌ కంపెనీ ప్రణాళిక పూర్తి చేసింది. అరేబియన్‌ బిజినెస్‌ కథనం ప్రకారం ఖరీదైన పర్యాటకుల కోసం దుబాయ్‌లో లగ్జరీ డీలక్స్‌ రిసార్టుల నిర్మాణానికి కెనడా ఆర్కిటెక్చరల్‌ కంపెనీ ప్రతిపాదించింది. ఈ అల్ట్రా లగ్జరీ హోటల్‌ 48 నెలల్లో 735 అడుగుల ఎత్తులో నిర్మాణం కానుంది. మూన్‌ దుబాయ్‌ రిసార్ట్‌ ద్వారా ఎమిరేట్స్‌లో ఆతిథ్యం, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, ఆకర్షణలు, విద్య, టెక్నాలజీ, పర్యావరణం మరియు స్పేస్‌ టూరిజం రంగాల ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ భావిస్తోంది.

మూన్‌ వరల్డ్‌ రిసార్ట్స్‌ వ్యవస్థాపకులు సంద్ర జి మాథ్యూస్‌, మైకేల్‌ ఆర్‌ హెండెర్సన్‌లు ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద మోడరన్‌ టూరిజం ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు మూన్‌ దుబాయ్‌ రిసార్ట్స్‌ ను ఏడాదికి కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని వారు వెల్లడించారు. ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్‌, నైట్‌ క్లబ్‌, ఈవెంట్‌ సెంటర్‌, గ్లోబల్‌ మీటింగ్‌ ప్లేస్‌, లాండ్‌, మూన్‌ షట్టల్‌ వంటి పలు ఎట్రాక్షన్స్‌ ఉన్నట్లు వారు వెల్లడించారు. మూన్‌ రిసార్ట్‌ లను నార్త్‌ అమెరికా, యూరోప్‌, మిడిల్‌ ఈస్ట్‌ మరియు నార్త్‌ ఆఫ్రికా మరియు ఆసియాల్లో ఏర్పాటు చేయడానికి లైసెన్సుల కోసం సంస్థ ప్రయత్నిస్తోందని వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement