న్యూఢిల్లీ – పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ఆప్ నేత సుశీల్ కుమార్ రింకు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఇటీవలి కాలంలో మరణించిన సభ్యుల మృతిపై లోక్‌సభ సంతాపం తెలిపింది. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ విషయానికి వస్తే.. జూన్‌లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళి అర్పించారు.. అనంతరం సభను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మధ్యాహ్నం కు వాయిదా వేశారు.
ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో జరగనున్నాయి. మొత్తం 31 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.