Tuesday, November 19, 2024

మంకీపాక్స్‌ ముప్పు, 29 దేశాలకు పాకిన వైరస్‌.. అస‌హ‌జ‌ శృంగారమే ప్రధాన కారణం

కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వైరస్‌ మంకీపాక్స్‌. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని పేర్కొంది. మంకీపాక్స్‌ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ పేర్కొన్నారు. తుంపర్ల ద్వారా మంకీపాక్స్‌ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గతంలో మంకీపాక్స్‌ వ్యాప్తి లేని దేశాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నమాట వాస్తవమేనని, కానీ వాటిని నివారించవచ్చు అని తెలిపారు. ఈ వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకోవటంతో పాటు, ఇతరులను రక్షించేందుకు ఉత్తమ మార్గాలున్నాయని టెడ్రోస్‌ సూచించారు. మంకీపాక్స్‌ సోకినట్లు తేలితే హోం ఐసోలేషన్‌లో ఉండాలి.

ఇతరులకు దూరంగా ఉండాలి. ఆపై ఆరోగ్యకార్యకర్తను సంప్రదించి కావాల్సిన చికిత్స తీసుకోవాలి. మంకీపాక్స్‌ చికిత్స కోసం యాంటీ వైరల్‌ , వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సరఫరా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఆ టీకాలు వైరస్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. వాటి సరఫరా, పంపిణీ కోసం సమన్వయ యం త్రాగాన్ని డబ్ల్యూ హెచ్‌ఓ అభివృద్ది చేస్తోంది అని ఆరోగ్యసంస్థ చీఫ్‌ తెలి పారు. మంకీపాక్స్‌ నివారణకు సామూహిక వ్యాక్సి నేషన్‌ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్‌ లో ఇప్పటివరకు మొత్తంగా 29 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూసినట్టు స మాచారం. ఈ వైరస్‌ అధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశా లతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 1000 కేసులు బయట పడినట్లు డబ్ల్యూ హెచ్‌ఓకు నివేదికలు అందాయి. మునుపెన్నడూ ఈ వైరస్‌ లేని దేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్‌ వల్ల ఆప్రికాలో మొత్తం 66 మంది మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement