ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్ మరోసారి కలవర పెడుతోంది. తాజాగా కేరళలో మరో ఇద్దరికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం వారిద్దరూ పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో ఒకరు వాయనాడ్‌కు చెందినవారు కాగా మరొకరు కన్నూర్‌కు చెందినవారు అని అధికారులు నిర్ధారించారు. కాగా, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.