Friday, November 22, 2024

మంకీపాక్స్‌ డేంజరస్‌ బెల్‌.. 4కు పెరిగిన సంఖ్య

విదేశీ ప్రయాణాల హిస్టరీనే లేని 34 ఏళ్ల ఢిల్లిd వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌ నిర్థారణౖనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఢిల్లిలో మొదటి మంకీపాక్స్‌ను వైద్యాధికారులు నిర్థారించారు. సిటీ లోక్‌నాయక్‌ జైప్రకాష్‌ ఆస్పత్రిలో చేరిన రోగికి మంకీపాక్స్‌ సోకింది. దీంతో, దేశంలో నమోదైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఇటీవల ఒక పార్టీకి హాజరయిన 34 ఏళ్ల వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి శాంపిల్‌ను డాక్టర్లు పూనే లోనేని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) శనివారం పంపగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరింది. మంకీపాక్స్‌ కు కూడా కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.

యుఎన్‌ఓ హెల్త్‌ ఎమర్జెన్సీపై ఉన్నతస్థాయి సమావేశం..

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ఒక్క రోజు తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ ఎస్‌) ఆదివారం న్యూఢిల్లిdలో మంకీపాక్స్‌ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ మరియు ఐసీఎంఆర్‌ ఉన్నతాధికారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇండియాలో నాలుగో మంకీపాక్స్‌ కేసు నమోదవడంపై అధికారులు సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని అదికారిక వర్గాల సమాచారం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement