కరోనా సంక్షోభం నుంచి కోరుకోకముందే ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కుదిపేస్తోంది. ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన మంకీపాక్స్ వైరస్ కేవలం 10 రోజుల్లోనే దాదాపు 12 దేశాలకు వ్యాప్తించింది. 92మందికి వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. మరో 28 అనుమానిత కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, యూకె, అమెరికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు వెల్లడించింది. తాజాగా తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ కేసులు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు ప్రకటించాయి.
విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తిలో లక్షణాలు గుర్తించి పరీక్షలు చేయగా… మంకీపాక్స్‌గా తేలినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజధాని తెల్ అవీవ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది. ఇతర దేశాల నుంచి తిరిగొస్తున్న వారిలో జ్వరం, చిన్నచిన్న గాయాల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. మంకీపాక్స్‌గా అనుమానిస్తున్న ఇతర కేసుల్ని కూడా పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు స్విట్జర్లాండ్‌లో బాధితుడి కాంటాక్ట్‌లోకి వచ్చిన వ్యక్తులందరినీ పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..