Friday, November 22, 2024

Moinabad – వికటించిన వైద్యం – పోయిన ప్రాణం

మొయినాబాద్ మండలం వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.. కాలికి గాయమైందని శస్త్ర చికిత్స కోసం దవాఖానకు వచ్చింది… శస్త్ర చికిత్స చేస్తుండగా వైద్యం వికటించి మహిళా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామస్తులు మృతురాలు కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని అండాపూర్ గ్రామానికి చెందిన మద్యపాగ రమేష్ భార్య మద్యపాగ సావిత్రి (30) ఐదు రోజుల క్రితం ఇంటివద్ద ప్రమాదవశత్తు కిందపడి కాళ్ళకి తీవ్ర గాయం అయింది.దీంతో కుటుంబ సభ్యులు స్థానిక భాస్కర ఆసుపత్రి లో చికిత్స కోసం తీసుకొచ్చారు.పరీక్షించిన అక్కడి వైద్యులు కాలికి శాస్త్ర చికిత్స చేయవలసిన అవసరం ఉందని కుటుంబ సభ్యులకు అక్కడి వైద్యులు వివరించారు.

- Advertisement -

కాలికి శస్త్ర చికిత్స చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు.శస్త్ర చికిత్స కోసం తీసుకెళ్లిన సావిత్రిని సాయంత్రం అయినా కుటుంబ సభ్యులకు చూపించకుండా వైద్యులు గోపెతను పాటించారు. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వైద్యులను ప్రశ్నించగా అప్పుడు సావిత్రిని చూడడానికి లోపలికి అనుమతించారు.అప్పటికే సావిత్రి అపస్పారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు శాస్త్ర చికిత్స చేసిన వైద్యులను ప్రశ్నించారు.

దీంతో వైద్యులు కుటుంబ సభ్యులకు పొందలేని సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున దావకానకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు.ఆందోళన చేస్తున్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు వెల్లడించారు.

సావిత్రి మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున కుటుంబీకులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement