Saturday, December 14, 2024

TG | అరెస్ట్ భయంతో మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్..

హైదరాబాద్ – మంచు కుటుంబం వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.. ఇప్పటికే దాడి ఘటనపై జర్నలిస్ట్ కు సారీ చెప్పిన మోహన్ బాబు ఆకస్మికంగా హైకోర్టు మెట్లెక్కారు.. జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.. దీంతో అలర్ట్ అయిన మోహన్ బాబు తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఈ మేరకు లంచ్ మోషన్‌ వేశారు.

కొట్టిన మాట నిజమే… ఎందుకు కొట్టానో ఆలోచించండి..
నేను మీడియా ప్రతినిధిని కొట్టిన మాట నిజమే… కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని, అయినప్పటికీ అలా కొట్టినందుకు చింతిస్తున్నానని సినీనటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక వెల్లడించారు. ఈ మేరకు 11 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు.

జర్నలిస్టును కొట్టాలనుకోలేదు.. చింతిస్తున్నా
జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేవారు జర్నలిస్టులా ? కాదా ? తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మీడియాను అడ్డు పెట్టుకొని తనపై దాడి జరగవచ్చని భావించానన్నారు. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. తాను కొట్టడం తప్పే కావొచ్చు… కానీ ఏ సందర్భంలో అలా చేశానో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జర్నలిస్ట్ రంజీత్ ను క్షమించమని కోరుతున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement