Thursday, December 12, 2024

HYD | మోహన్ బాబుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక !

మోహన్ బాబు, మంజు మ‌నోజ్ కుటుంభ క‌ల‌హాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా, జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్ర‌మంలో క‌వ‌రేజ్ చేయ‌డానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహ‌న్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ మీడియా ప్రతినిధులను గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనలో మోహన్‌బాబు బీపీ పెరిగి కింద ప‌డిపోగా.. స్వల్ప గాయాలు కావడంతో ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

మోహ‌న్ బాబుకు నోటీసులు

అయితే, మీడియా ప్రతినిధులపై మోహ‌న్ బాబు దాడి చేయండంతో డిపార్టమెంట్ అంతా అప్రమత్తమైంది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు వద్ద ఉన్న తుపాకీతో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇక రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్లో విచారణకు హాజరు రావాలని ఆదేశించారు. గతంలో వీరిద్దరూ జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్స్ పొందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement