ఇంగ్లండ్ లో సీరీస్ లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్‌లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. తద్వార ఇంగ్లాండు భారీ స్కోరుకు అడ్డుకట్ట వేయగలిగాడు. అయితే క్రీజులో కుదురుకున్న జానీ బెయిర్ స్టో వికెట్ తీయడం ద్వారా భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చిన సిరాజ్.. వికెట్ తీసిన అనంతరం ఓ కొత్త స్టైయిల్ లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. విమర్శకుల నోటికి తాళం వేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు సిరాజ్. ఇక నోళ్లు మూసుకోండి అన్నట్లుగా సిరాజ్ ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్‌కు తెర తీశాడు. నన్ను ద్వేషించే వాళ్ల కోసమే ఈ స్టోరీ. నా గురించి వాళ్లు ఎన్నో అన్నారు. నేను అది చేయలేను, ఇది చేయలేను అని విమర్శించారు. అందుకే నేను బంతితోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాను. అలా ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్ వచ్చింది అని సిరాజ్ చెప్పడం విశేషం.
ఇక రాహుల్‌పై గ్యాలరీలోని అభిమానులు సీసా బిరడా విసరడంపై కూడా సిరాజ్ స్పందించాడు. ఆ విషయం గురించి తనకు పూర్తిగా తెలియదని, అయితే వాళ్లు అభ్యంతరకర వ్యాఖ్యలైతే ఏమీ చేయలేదని చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఈ నెల 21 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు..