ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోక్బర్ ఎన్నికయ్యారు. ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు మోక్బర్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇరాన్ రాజకీయాలకు సుపరిచితమైన మహమ్మద్ మొక్బర్ 2021లో రైసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, మొక్బర్ అధ్యక్షతన పార్లమెంటరీ స్పీకర్, జ్యుడీషియరీ చీఫ్ ఓ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. 50 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్‌దే. అయితే… ఈ ప్రక్రియకు సుప్రీం లీడర్ అనుమతి తప్పని సరి.