Tuesday, November 26, 2024

మద్యం.. మతం.. మొయిన్ అలీ.. ఏంటీ కథ?

ఈ ఏడాది ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిల్ అలీని వేలంలో రూ.7 కోట్లకు దక్కించుకుంది. అయితే ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో జెర్సీ వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మొయిన్ అలీ త‌ను వేసుకునే జెర్సీపై మ‌ద్యం విక్ర‌యాలు చేసే కంపెనీ లోగో వద్దన్నాడని ప్ర‌చారం జ‌రిగింది. అలీ ఏ టీం త‌రఫున బ‌రిలో ఉన్నా తన జెర్సీపై మద్యం కంపెనీ లోగోలు ఉండటానికి ఒప్పుకోడట. దీంతో చెన్నై టీం కూడా అలీ డిమాండ్‌కు ఒప్పుకుంద‌ని వార్తలు వచ్చాయి. మొయిలీ జెర్సీపై మద్యం కంపెనీ లోగో ముద్రించ‌టం లేద‌ని ఆ వార్తల సారాంశం.

అయితే ఇందులో నిజం లేద‌ని చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ స్పష్టం చేశారు. మెయిన్ అలీ నుండి అలాంటి ప్ర‌తిపాద‌నే లేద‌ని, ఒకవేళ తను అడిగితే ఆలోచిస్తామ‌ని పేర్కొన్నారు. మెయిన్ అలీ జాతీయ జట్టు ఇంగ్లండ్‌తో పాటు ఏ జ‌ట్ల‌కు ఆడినా ముస్లిం సాంప్ర‌దాయ‌ల‌ను గౌర‌విస్తాడట. గ‌తంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ త‌రఫున కూడా మ‌ద్యం బ్రాండ్ లోగో లేకుండానే అలీ ఆడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement