Tuesday, November 26, 2024

మోడీ పాలన కార్పొరేట్లకు వరం – సామాన్యులపై భారం : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్ : మోడీ పాలన కార్పొరేట్లకు వరం.. సామాన్యులపై భారంగా మారింద‌ని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పీక్ లోడ్ హవర్స్ లో ప్రతి యూనిట్ కి 20 శాతం అదనపు చార్జి వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి మండిపడ్డారు. ఆదివారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందన్నారు. కార్పొరేట్లకు లాభం కోసమే మోడీ పరిపాలన పని చేస్తుందన్నారు. పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందన్నారు. గతంలోనూ తెలంగాణ విద్యుత్ పై కుట్రలు చేసి రుణాలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ప్రజలపై భారం వేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం పేదల పై భారం వేయడాన్ని అడ్డుకుంటామన్నారు. మోడీ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement